తిరువనంతపురం: కేరళకు చెందిన 18వ శతాబ్దపు క్యాథలిక్ మతసేవకుడు దేవసహాయం పిైళ్లె అపూర్వ గౌరవం అందుకోబోతున్నారు. ఇంతవరకు క్రైస్తవ మతబోధకులకే పరిమితమైన ‘సెయింట్‌హుడ్’ తొలిసారిగా ఓ మత సేవకునికి అందించనున్నారు. వాటికన్లో మంగళవారం జరిగిన ఎంపిక సభ పిైళ్లెకి పునీతుల పరంపరలో చోటు కల్పించాలని నిర్ణయించింది. చర్చిలో ఎలాంటి మతాధికారి పదవి పొందకుండా మత వ్యవహారాలలో పాల్గొనే ‘లేమ్యాన్’ తరగతికి చెందిన పిైళ్లెకు 2022 మే 15న పోప్ ఫ్రాన్సిస్ పునీత హోదా ప్రసాదిస్తారు. పిైళ్లె భారత్ నుంచి పునీతునిగా ఎంపికైన మొదటి ‘లేమ్యాన్’ అవుతారు.