CTI Letter | పదిలక్షల మందితో నిరసనకు దిగితే వ్యాపారాలు ఎలా చేసుకోవాలి.. రాహుల్‌గాంధీకి ట్రేడర్స్ మరో లేఖ..!
CTI Letter | సీఈసీ (CEC) రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ (Congress Party) నవంబర్ 1న మెగా ర్యాలీ (Megha Rally) కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీపావళి పండగ (Diwali Festival) వేళ ఈ ఆందోళన కారణంగా తాము నష్టపోతామని, ర్యాలీని వాయిదా వేసుకోవాలని దేశ రాజధానిలోని వ్యాపార సంఘాలు అభ్యర్థించాయి.
CTI Letter : సీఈసీ (CEC) రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ (Congress Party) నవంబర్ 1న మెగా ర్యాలీ (Megha Rally) కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీపావళి పండగ (Diwali Festival) వేళ ఈ ఆందోళన కారణంగా తాము నష్టపోతామని, ర్యాలీని వాయిదా వేసుకోవాలని దేశ రాజధానిలోని వ్యాపార సంఘాలు అభ్యర్థించాయి. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కి లేఖ రాశాయి.
దీనిపై కాంగ్రెస్ పార్టీగానీ, రాహుల్‌గాంధీగానీ సానుకూలంగా స్పందించకపోవడంతో ‘ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI)’ మరోసారి లేఖ రాసింది. పది లక్షల మంది నిరసనకారులు ఢిల్లీకి వస్తే వ్యాపారం ఎలా చేసుకోవాలని ప్రశ్నించింది. దీపావళి పండగ సీజన్లో ర్యాలీ నిర్వహించడంవల్ల రామ్‌లీలా మైదానం పరిసరాల్లో దాదాపు రూ.10 వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం పడవచ్చని పేర్కొన్నది. ర్యాలీని నవంబర్ 10కి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది. లేదంటే వాణిజ్య ప్రాంతాలకు దూరంగా నిరసన ప్రదేశాన్ని మార్చాలని లేఖలో కోరింది.
ఈ లేఖ ప్రతిని రాహుల్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు కూడా పంపామని, దీనిపై ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో చర్చించాలని కోరామని సీటీఐ ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ తెలిపారు. అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో రామ్‌లీలా ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేయడం, రోడ్లను మూసివేయడం వంటి చర్యలవల్ల వినియోగదారులు దుకాణాలకు వచ్చే అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇరుకైన ఢిల్లీ వీధులల్లోకి లక్షలమంది నిరసనకారులు, 20 వేల వాహనాలు రావడంవల్ల వ్యాపారం జరగదన్నారు.
అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో సుమారు 4 వేల మంది పాల్గొనడం వల్ల దిల్లీ అంతటా రాకపోకలకు అంతరాయం కలిగిందని తెలిపారు. దీనివల్ల వ్యాపారులకు రూ.3 వేల కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CTI Letter | పదిలక్షల మందితో నిరసనకు దిగితే వ్యాపారాలు ఎలా చేసుకోవాలి.. రాహుల్‌గాంధీకి ట్రేడర్స్ మరో లేఖ..!
‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఓటే ఆయుధం’
MANIKANDA | అయ్యప్పపై ‘మాలికాపూరం’ దర్శకుడి కొత్త చిత్రం.. ‘మణికంఠ’ ఫస్ట్ లుక్ విడుదల
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

