నేపాలీ మహిళను కాల్చిచంపిన దోపిడీ దొంగలు..!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు దారిదోపిడీ దొంగలు దారుణానికి ఒడిగట్టారు. బైక్‌పై వెళ్తూ ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులను అపహరించారు. అక్కడి నుంచి పారిపోతూ దారిలో కనిపించిన మరో మహళ మెడలో బంగారు గొలుసును లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి సదరు మహిళ తప్పించుకోగా.. రోడ్డు పక్కనే తినుబండారాలు అమ్ముకునే దుకాణం నిర్వహిస్తున్న నేపాలీ మహిళ ఛాతిలో బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. సమీర్, అతని మేనల్లుడు ఫైజాన్ (25) కలిసి బుధవారం రోహిణి ఏరియాలో ఇద్దరు మహిళలను అడ్డగించారు. వారికి తుపాకీ చూపి బెదిరిస్తూ వారి నుంచి బంగారు ఆభరణాలు లాక్కుకున్నారు. అక్కడి నుంచి పారిపోతూ తిమార్పూర్ ఏరియాలో ఒంటరిగా తారసపడ్డ మరో మహిళను దోచుకునే ప్రయత్నం చేశారు. అయితే సదరు మహిళ వారితో పెనుగులాడటంతో తప్పించుకోవడం కోసం ఆమెపై కాల్పులు జరిపారు. కానీ ఆమె పక్కకు తప్పుకోవడంతో బుల్లెట్ నేరుగా వెళ్లి రోడ్డు పక్కన తినుబండారాల దుకాణం నిర్వహిస్తున్న మీనా (45) అనే నేపాలీ మహిళకు తగిలింది.
స్థానికులు వెంటనే మీనాను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం గీతా కాలనీ ఏరియాలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

