అక్కినేని అఖిల్ కథానాయకుడిగా స్పైథ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. ఈ సినిమాలో మలయాళీ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. సోమవారం మొదలైన ఈ సినిమా తాజా షెడ్యూల్లో మమ్ముట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దీనికి ‘ద డెవిల్ రూత్‌లెస్ సేవియర్’ అనే క్యాప్షన్‌ను జోడించారు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనైనా నమ్మిన వారికి రక్షకుడిగా నిలిచే పాత్ర ఇదని చిత్రబృందం తెలిపింది. ‘స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశమిది. ఓ రహస్యాన్ని ఛేదించే గూఢచారిగా అఖిల్ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. ఈ సినిమా ైస్టెలిష్ మేకింగ్‌తో అందరిని ఆకట్టుకుంటుంది’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రగుల్ హెరియన్ ధరుమన్, సంగీతం: హిప్హాప్ తమిళ, నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా, సహనిర్మాతలు: అజయ్ సుంకర, పత్తి దీపారెడ్డి, దర్శకుడు: సురేందర్ రెడ్డి.