సోషల్ మీడియా మాటల యుద్ధాలకు దూరంగా ఉండే బాలీవుడ్ నాయిక దీపికా పడుకోన్ తాజాగా ఓ నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన దుస్తుల విషయంలో విమర్శించినందుకు ఘాటుగా సమాధానమిచ్చింది. దీపికా ప్రస్తుతం ‘గెహ్రయాన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో దీపికా పడుకోన్ ఆధునిక దుస్తుల్లో కనిపిస్తున్నది. ఈ విషయంపై ఓ నెటిజన్ విమర్శిస్తూ…బాలీవుడ్ న్యూటన్ సూత్రం ఏంటంటే ‘గెహ్రయాన్’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుంటే దీపిక దుస్తులు కురచ అవుతున్నాయి అని అంది. ఇందుకు స్పందించిన దీపికా.. ఈ విశ్వం న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లతో పాటు మూర్ఖులతోనూ నిండి ఉందని శాస్త్రవేత్తలు చెప్పడం మరిచారు అంటూ సమాధానమిచ్చింది. ఫిబ్రవరి 11న ‘గెహ్రయాన్’ సినిమా ఓటీటీలో విడుదల కానుంది.