హనుమకొండ, జూన్ 25 : ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (సర్,స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గురువారం ప్రారంభం కాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ జులైవాడ 117వ బూత్ పరిధిలో బీఎల్వో మణికంఠారెడ్డితో కలిసి పోలీస్ కాలనీలో ఓటర్లను కలిశారు. ఎన్యుమరేషన్ పంపిణీ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ద్వారా కచ్చితమైన సమాచారంతో కూడిన ఓటరు జాబితా తయారవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించేందుకు బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఇప్పటికే పార్టీపరంగా బీఎల్ఏలను నియమించామని, వారు బూత్ స్థాయిలో ఓటర్లను కలుస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో మ్యాపింగ్ దాదాపు పూర్తయ్యిందని, హనుమకొండ వంటి పట్టణాల్లో మ్యాపింగ్ కొంత కష్టతరంగా మారిందనే సమాచారం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్నామన్నారు. కానీ, ఓటరు మ్యాపింగ్ చేసేందుకు ఎన్నికల కమిషన్, బీఎల్వోలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.
భారతదేశం ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నదేశమని, ప్రజాస్వామ్యంలో ప్రజలు వారి ప్రతినిధులను ఓటు హకు ద్వారా ఎన్నుకొంటారని, నేడు జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ప్రక్రియ అని అన్నారు. ఓటరు విధిగా తన ఓటును 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం మ్యాపింగ్ చేసుకోవాలని సూచించారు. డబుల్, డెత్ ఓటర్ లేకుండా అర్హత కలిగిన వారి ఓటు ఉండేలా, కొత్త ఓటరును సైతం నమోదయ్యే విధంగా బీఆర్ఎస్ పార్టీ, పార్టీ నియమించిన బీఎల్వోలు పనిచేస్తున్నారని తెలిపారు. సర్ ప్రక్రియపై పార్టీ పరంగా ఇప్పటికే డివిజన్ల వారీగా సమావేశాలు సైతం నిర్వ హించామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ మాజీ అధ్యక్షుడు కోటేశ్వర్రావు, 5వ డివిజన్ మాజీ అధ్యక్షుడు పున్నం చందర్, నాయకులు ఇమాముద్దీన్, మూటిక రాజుయాదవ్, మల్లారెడ్డి, ప్రసాద్, సంపత్ పాల్గొన్నారు.