నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సారంగాపూర్ (13వ) డివిజన్లో గల మున్సిపల్ ఆఫీస్‌ను అధికార పార్టీ నేతలు తమ పార్టీ కార్యాలయంగా మార్చేశారు. 13వ డివిజన్ కాంగ్రెస్ కార్యాలయం పేరుతో ఫ్లెక్సీ పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన స్థానికులు బహిరంగంగానే ప్లెక్సీ ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అధికారులకు కనిపించట్లేదా? అని చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌ను వివరణ కోరిన అనంతరం సిబ్బందితో ఆ ఫ్లెక్సీని తొలగింపజేశారు.
– కంఠేశ్వర్