PM Mette Frederiksen | న్యూఢిల్లీ: డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడెరిక్సెన్‌పై శుక్రవారం ఆ దేశ రాజధాని కోపెన్‌హాగన్‌లోని కల్టోర్వెట్లో దాడి జరిగింది. దాడి చేసిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఇతర వివరాలను వెల్లడించలేదు.
ప్రధానికి వ్యతిరేక దిశ నుంచి వచ్చిన దుండగుడు ఆమె భుజాలను పట్టుకుని బలంగా నెట్టేయడంతో ఫ్రెడెరిక్సెన్ కిందపడిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. యూరోపియన్ యూనియన్ ఎన్నికల వేళ రాజకీయ నేతలపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మే 15న స్లొవేకియా ప్రధాని ఫికోపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే.