కాఫీతో గుండెకు రక్ష
మారిన జీవనశైలిలో గుండె జబ్బుల ముప్పు నానాటికీ పెరుగుతున్నది. అయితే, మనం రోజూ తాగే కాఫీ గుండెను పదిలంగా ఉంచుతుందని సరికొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రోజుకు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు.
మారిన జీవనశైలిలో గుండె జబ్బుల ముప్పు నానాటికీ పెరుగుతున్నది. అయితే, మనం రోజూ తాగే కాఫీ గుండెను పదిలంగా ఉంచుతుందని సరికొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రోజుకు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ బేకర్ హార్ట్ అండ్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ ప్రతిష్ఠాత్మక పరిశోధనను నిర్వహించారు. బ్రిటన్‌కు చెందిన ‘యూకే బయోబ్యాంక్’ నుంచి సేకరించిన దాదాపు నాలుగున్నర లక్షల మంది డేటాను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చారు. దాదాపు పన్నెండున్నర సంవత్సరాల పాటు వీరి ఆరోగ్య అలవాట్లను, కాఫీ వినియోగాన్ని పరిశోధకులు నిశితంగా గమనించారు. ఈ సుదీర్ఘ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగుచూశాయి.
రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగే వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం, కాఫీ తాగని వారి కంటే 20% తక్కువగా ఉన్నట్లు తేలింది. గ్రౌండ్ కాఫీ, ఇన్స్టంట్ కాఫీ లేదా డీకాఫిన్ అంటే కెఫిన్ తీసేసిన కాఫీ… రకం ఏదైనా సరే, కాఫీ క్రమం తప్పకుండా తాగే వారిలో అకాల మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ఇక, కాఫీలో కేవలం కెఫిన్ మాత్రమే కాదు, శరీరంలో వాపులను తగ్గించే, జీవక్రియలను మెరుగుపరిచే 100కు పైగా జీవసంబంధిత సమ్మేళనాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అయితే… చక్కెర, పాలు అతిగా లేకుండా బ్లాక్ కాఫీ లేదా తక్కువ మోతాదు పాలతో తీసుకుంటే ఈ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నిజజీవితంలో ఎంతో ఉపయోగపడే ఈ పరిశోధన, కాఫీ ప్రియులకు ఒక తీపి కబురనే చెప్పాలి!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

