2 రోజులు భారీ వర్షసూచన
మురసు తుపాను నెల్లూరు-నర్సాపురం మధ్య ఒంగోలు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున తీరం దాటినట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను క్రమంగా బలహీనపడే అవకాశం ఉన్నదని చెప్పారు. తెలంగాణకు దగ్గరగా కదులుతుండటంతో రాష్ట్రంలో రెండురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించారు.
- తూర్పు జిల్లాలకు రెడ్, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ఈ నెల 15నాటికి మరో తుపాను!
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): మురసు తుపాను నెల్లూరు-నర్సాపురం మధ్య ఒంగోలు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున తీరం దాటినట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను క్రమంగా బలహీనపడే అవకాశం ఉన్నదని చెప్పారు. తెలంగాణకు దగ్గరగా కదులుతుండటంతో రాష్ట్రంలో రెండురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. గురువారం నుంచి తుపాను ప్రభావం తగ్గే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రvvత క్రమంగా తగ్గే అవకాశమున్నదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 6.10 సెం.మీ, నాయుడుపేటలో 5.60 సెం.మీ, మల్కారంలో 5.40 సెం.మీ, ఖమ్మం జిల్లా వేంసూర్లో 5.23 సెం.మీ, సదాశివపాలెంలో 4.78 సెం.మీ, ఆదిలాబాద్, సూర్యాపేట, ములుగు, మహబూబాబాద్, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఈ నెల 15 నాటికి మరో కొత్త తుపాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిపై ఈ నెల 9 లేదా 10న వాతావరణ శాఖ పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తుపాను ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనివల్ల దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమతోపాటు తమిళనాడుపై కూడా తీవ్ర ప్రభావం ఉండవచ్చునని తెలిపారు.
‘మురసు’తో పంటలకు దెబ్బ
ఖమ్మం, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తుపాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పత్తి ఏరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో వర్షాలు కురుస్తుండటం, చల్లటిగాలులు వీస్తుండటంతో పత్తి తడిసిపోతే నాణ్యత దెబ్బతినడంతోపాటు దిగుబడి, గిట్టుబాటు ధరపై ప్రభావం పడుతుందని దిగులు చెందుతున్నారు. ఇక ఈదురుగాలులకు వరి నేలవాలి వడ్లు పూర్తిగా రాలిపోతాయని భయపడుతున్నారు. పంటల కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన అన్నదాతలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోవాల్సి వస్తుందేమోనని ఆవేదన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం చొప్పకట్లపాలెంలో వర్షానికి తడిసి చెట్టుపై నుంచి పత్తి కారిపోతున్నది. కల్లూరు మండలం, తల్లాడ మండలం రామచంద్రాపురంలో వరి చేనులో పంట నేలవాలింది. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో రైతులు టార్పాలిన్లు కప్పి ధాన్యం రాశులు తడువకుండా తంటాలు పడ్డారు. కాగా సూర్యాపేట జిల్లా పెన్పహాడ్, చిలుకూరు, సూర్యాపేట రూరల్, మేళ్లచెర్వు, మఠంపల్లి, కోదాడ, నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వరి పంట నేలకొరిగింది. పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

