ఆ తరహా పాత్రలు చేసే సత్తా మాలో ఉంది
స్త్రీవాదాన్ని బలంగా వినిపించే బాలీవుడ్ కథానాయికల్లో కృతి సనన్ ముందు వరుసలో ఉంటుంది.
స్త్రీవాదాన్ని బలంగా వినిపించే బాలీవుడ్ కథానాయికల్లో కృతి సనన్ ముందు వరుసలో ఉంటుంది. సినీ పరిశ్రమలో స్త్రీలపై వివక్ష అనే అంశంపై ఆమె పలుమార్లు స్పందించారు కూడా. తాజాగా ప్రేక్షకులను థియేటర్లకు తెచ్చే సత్తా హీరోయిన్లకు కూడా ఉందని, కేవలం అగ్ర హీరోలతో మాత్రమే అధిక బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసే సంస్కృతి నుంచి మేకర్స్ బయటకు రావాలని కృతి సనన్ అన్నారు.
ఇటీవల ఓ ప్రైవేటు వేడుకలో ఆమె మాట్లాడుతూ ‘పఠాన్, ధురంధర్ లాంటి భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలను మహిళా ప్రధాన పాత్రలతో తెరకెక్కించినా జనం ఆదరిస్తారు. అలాంటి పాత్రల్ని చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తీయడానికి నిర్మాతలకు ధైర్యం ఉందా?’ అని కృతి సనన్ ప్రశ్నించారు. నిర్మాతలు ధైర్యం చేసి, తమ లాంటి హీరోయిన్లతో భారీ కమర్షియల్ సినిమాలు నిర్మించగలిగితే.. వాటిని తమ భుజస్కంధాలపై విజయవంతంగా మోయగలిగే శక్తి తమకుందని కృతి సనన్ చెప్పారు. కృతి సనన్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

