అదేదో సినిమాలో హీరోయిన్ ‘కొంచెం కొంచెం కొరుక్కుతినవయ్యా..’ అని తన్మయత్వంతో పాడుకున్న పాట గుర్తుకొస్తుంది ఈ ఫొటో చూస్తే. ఓ చెవికి చెంచా, ఓ చెవికి ఫోర్క్ జూకాలు ధరించింది ఈ అమ్మాయి.
మెడలో అదనంగా కత్తుల పెండెంట్లూ వేలాడుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో ‘కట్లరీ జువెలరీ’ సరికొత్త ట్రెండ్. దాన్నే ఈ సుందరాంగి ఫాలో అవుతున్నట్టు అనిపిస్తున్నది.