నవీన్‌చంద్ర, దివ్యాపిైళ్లె, అనన్య సేన్‌గుప్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తగ్గేదే లే’. శ్రీనివాస్ రాజు దర్శకుడు. భద్ర ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించబోతున్నారు. మంగళవారం కథానాయిక దివ్యాపిైళ్లె పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. నవీన్‌చంద్ర, దివ్యాపిైళ్లె కెమిస్ట్రీ సినిమాలో ప్రధానాకర్షణగా ఉంటుందని, వినూత్నమైన క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించామని చిత్ర బృందం తెలిపింది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. నాగబాబు, డానీ కుట్టప్ప, రవికాలే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: చరణ్ అర్జున్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజా రవీందర్, రచయిత, దర్శకత్వం: శ్రీనివాస్ రాజు.