మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మృతికి క్రికెట్ ప్రపంచం ఘనమైన నివాళి అర్పించింది. గుండెపోటుతో లోకాన్ని వీడిన 52 ఏండ్ల వార్న్ మరణంతో క్రీడాలోకం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. తన స్పిన్ మాయాజాలంతో క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన దిగ్గజ స్పిన్నర్‌కు స్వదేశంలో అభిమానులు అంజలి ఘటించారు. శనివారం మెల్బోర్న్ స్టేడియంలోని వార్న్ విగ్రహం ముందు పుష్పగుచ్చాలతో పాటు అతడికి ఇష్టమైన బీర్లు, వైన్ బాటిళ్లు, సిగరెట్లు, బేక్డ్ బీన్స్ లాంటి పదార్థాలు ఉంచారు.