వేములవాడ, జూన్ 17: వేములవాడ పురపాలక సంఘం విలీన గ్రామాల రహదారులను ఇంకెప్పుడూ అభివృద్ధి చేస్తారంటూ సీపీఎం నాయకుడు గురుజాల శ్రీధర్ రహదారిపై బైఠాయించి బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేములవాడ రాజన్న క్షేత్రం నుండి విలీన గ్రామమైన అయ్యోరుపల్లి, అనుబంధ గ్రామాలు రామన్నపేట, రత్నంపేట వరకు వెళ్లే లక్ష్మీపురం రహదారిని రెండు వరుసల రహదారి చేయాలన్నారు.
అలాగే సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకుళ్లినా అభివృద్ధికి నోచుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా తక్షణమే రహదారిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.