ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు కమ్ముకున్నాయి.

న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు కమ్ముకున్నాయి. వచ్చే నెలలో జరుపతలపెట్టిన పోర్చుగల్, ఫ్రాన్స్ పర్యటనలు రద్దు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈయూ శిఖరాగ్ర సమావేశం వర్చువల్ జరిపేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారుతున్నది. ఇది ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కూడా ప్రభావం చూపుతున్నది. వచ్చే నెలలో మోదీ ఫ్రాన్స్, పోర్చుగల్ పర్యటన ఇబ్బందుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో ప్రతిరోజూ రెండున్నర మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ కారణంగా భారతదేశం నుంచి వచ్చే ప్రయాణికులను వివిధ దేశాలు నిషేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి విదేశీ పర్యటనపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలుస్తున్నది.
ప్రధాని పర్యటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించనప్పటికీ సన్నాహాలు మాత్రం జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో వర్చువల్‌గా నిర్వహించే ఈయూ సదస్సులో మాత్రమే మోదీ పాల్గొనే అవకాశాలున్నాయి.
ఇప్పటికే షెడ్యూల్ చేసిన వివరాల ప్రకారం.. వచ్చే నెల 8 న ప్రధాని మోదీ పోర్చుగల్ పర్యటన చేపట్టి అక్కడి నుంచి ద్వైపాక్షిక చర్చల కోసం ఫ్రాన్స్ కూడా వెళ్తారు. అక్కడ ఫ్రెంచ్ అధ్యక్షుడితో భేటీ కానున్నారు. జూన్‌లో జీ 7 శిఖరాగ్ర సమావేశం సమయానికి పరిస్థితులు మెరుగుపడితేనే ప్రధాని మోదీ బ్రిటన్ను సందర్శించవచ్చు. జీ 7 లో బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి.
ఇలాఉండగా, భారతదేశంలో కరోనా ఇన్ఫెక్షన్ పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన వాయిదా పడింది. ఇప్పుడు అతను కొన్ని రోజుల తరువాత భారతదేశానికి రావాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే బోరిస్ జాన్సన్ ఒకసారి భారత పర్యటన రద్దైంది.
ఇవి కూడా చదవండి..
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్‌బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్‌లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్‌లో లాక్‌డౌన్‌కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

