న్యూఢిల్లీ: మహిళల హాకీ ప్రొ లీగ్లో భారత్-ఇంగ్లండ్ మ్యాచ్లు వాయిదాపడ్డాయి. ఏప్రిల్ 2, 3న ఇంగ్లండ్తో జరుగాల్సిన మ్యాచ్లను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ్ జట్టులోని సభ్యుల్లో కొందరికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో మ్యాచ్లను ఎఫ్ఐహెచ్ వాయిదా వేసింది. ‘ఇంగ్లండ్ మహిళల బృందం భారత పర్యటనను రద్దు చేసుకుంది. జట్టులోని కొందరు కరోనా వైరస్ బారినపడడం.. మరికొందరు గాయాలతో మ్యాచ్లకు దూరమవడంతో ఇంగ్లండ్ భారత్కు రావడం లేదు. తదుపరి సమాచారం త్వరలో వెల్లడిస్తాం’ అని ఎఫ్ఐహెచ్ పేర్కొంది.