జూరాల ప్రాజెక్టుకు స్థిరంగా వరద

- లక్షా 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- 16 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల
- 12 యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
- లక్షా 6వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో
ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద స్థిరంగా కొనసాగుతుంది. ఎగువ నుంచి లక్షా 10,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 16 గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 65,344 క్యూసెక్కు ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఆయకట్టు, త్రాగునీటి పథకాల నిర్వహణకు నీటి విడుదల కొనసాగుతుంది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కు లు, ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 730, సమాంతర కాలువకు 150, భీమా 2కు 750 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.
విద్యుతుత్పత్తికి 39,037 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లోని 12 యూనిట్లలో నిర్విరామంగా విద్యుతుత్పత్తి నిర్వహిస్తున్నారు. ఎగువ జూరాల విద్యుత్ కేంద్రం 6 యూనిట్ల ద్వార 4.284 మి.యూ ఉత్పత్తి జరుగగా ఇప్పటివరకు మొత్తంగా 280.084 మి.యూ ఉత్పత్తి జరిగింది.
దిగువ జూరాల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 4.277 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 304.000 మి.యూ విద్యుతుత్పత్తి జరిగింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా సాయంత్రానికి 8.730 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నుంచి లక్షా 6,893 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

