సాగర్ ఉప ఎన్నిక : వామపక్షాల మద్దతు కోరిన కాంగ్రెస్
వామపక్షాల మద్దతు కోరిన కాంగ్రెస్ | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వామపక్ష పార్టీలకు లేఖ రాసింది. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వామపక్ష పార్టీలకు లేఖ రాసింది.
కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో ఫోన్లోనూ మాట్లాడారు.
త్వరలో కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శులతో వీరు చర్చలు జరిపే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది మృతి చెందడంతో ఉప ఎన్నికల అనివార్యమైంది.
ఇప్పటికే కాంగ్రెస్ తమ అభ్యర్థిగా జానారెడ్డిని ప్రకటించింది. సిట్టింగ్ స్థానం కావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. బీజేపీ సైతం అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

