BRS | సర్పంచ్ నామినేషన్ల మొదటి రోజే కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ.. బీఆర్ఎస్లో చేరికలు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలోని కోడేర్ మండలంలో సర్పంచ్ నామినేషన్ల మొదటిరోజు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలోని కోడేర్ మండలంలో సర్పంచ్ నామినేషన్ల మొదటిరోజు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు
దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మరే బొజ్జన్న ఆదివారం చేరారు. ఆయనకు రఘువర్ధన్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీలు మాత్రమే ఇచ్చి ఎన్నికల అనంతరం మోసం చేసిందని కొమ్మరే బొజ్జన్న విమర్శించారు.
నియోజవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా చేసేందుకు, కొల్లాపూర్ గడ్డపై గులాబీ జెండాను ఎగరవేసేందుకు గులాబీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కోడేరు మండలంలో కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికలలో బొంద పెట్టి అత్యధిక సర్పంచ్ స్థానాలలో గులాబీ జెండాను ఎగరవేస్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీశైలం, యాపట్ల శేఖర్, ఆర్కే రామకృష్ణ, మాజీ వార్డు మెంబర్ బాలస్వామి, నండిపల్లి శేఖర్ రెడ్డి, లక్ష్మీకాంత్, కొమ్మారె రాజు, తుక్కదిన్నె రాజు, ఇరుగద్దిన్నెల వెంకటేష్ , ధర్మేష్, మైయిబుసు మహేష్ , బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకుడు యాపచెట్టు లాలు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాతావరణ అనుకూల వ్యవసాయంపై రైతులకు అవగాహన
అర్వపల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్
Mukra Farmers | ఎండిన పత్తి మొక్కలతో సెల్ఫీలు..రాహుల్‌కు పంపిన ముఖరా( కె ) రైతులు
‘గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును బాధ్యతగా తీసుకోవాలి’
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

