‘సాగునీటి తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగునీటిని తరలించేందుకు ప్రయత్నిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలమైందని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.అంజయ్య చారి విమర్శించారు. శనివారం నాంపల్లి మండల సీపీఐ కార్యాలయంలో....
నాంపల్లి, నవంబర్ 28 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగునీటిని తరలించేందుకు ప్రయత్నిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలమైందని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.అంజయ్య చారి విమర్శించారు. శనివారం నాంపల్లి మండల సీపీఐ కార్యాలయంలో పల్లె సైదులు అధ్యక్షతన నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 1న నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే జైల్‌భరో కార్యక్రమాన్ని మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నాగార్జునసాగర్ నుండి సొరంగ మార్గం ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని ఎద్దేవా చేశారు. నీటి తరలింపుతో తెలంగాణ రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి సుదనబోయిన రమేశ్, సహాయ కార్యదర్శి నేతాళ్ల రాజు, మండల కార్యవర్గ సభ్యులు ఊరుపాక వెంకటయ్య, నేరెళ్ల సైదులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సాగునీటి తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

