అసైన్డ్ భూముల పట్టా.. కంప్యూటర్ ఆపరేటర్ అరెస్టు

మంచిర్యాల : అసైన్డ్ భూములను పలువురి పేర్లపై అక్రమంగా పట్టా చేసిన కేసులో కంప్యూటర్ ఆపరేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో బుధవారం చోటుచేసుకుంది. నెన్నెల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే నరేశ్ గౌడ్ పలువురి వ్యక్తుల నుండి రూ. వెయ్యి, రూ. 2 వేలు తీసుకుని అసైన్డ్ భూములను అక్రమంగా పట్టా చేస్తున్నట్లు ఆరోపణలు. రామగుండం సీపీ వి. సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెన్నెల తహసీల్దార్ జడి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నరేశ్ గౌడ్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇతనితో పాటు మరో పదిమంది రెవెన్యూ అధికారులపై కేసులు నమోదైనట్లు చెప్పారు. 2012 నుండి ఇప్పటివరకు మొత్తం 88 మంది రైతులకు అసైన్డ్ భూములను పట్టా చేసినట్లుగా విచారణలో నరేశ్ తెలిపాడన్నారు. మండలంలోని ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులకు 207 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

