Masooda | తిరువీర్ కెరీర్లో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్.. ‘మసూద’ సినిమాకు 4 ఏళ్లు!
Thiruveer | టాలీవుడ్ వర్ధమాన నటుడు తిరువీర్ (Thiruveeer) కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంచలనాత్మక హారర్ థ్రిల్లర్ ‘మసూద’ (Masooda).
టాలీవుడ్ వర్ధమాన నటుడు తిరువీర్ (Thiruveeer) కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంచలనాత్మక హారర్ థ్రిల్లర్ ‘మసూద’ (Masooda). సాయికిరణ్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం, ఎలాంటి భారీ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా 2022 నవంబర్ 18న విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. అప్పట్లో ప్రేక్షకులను భయపెడుతూనే బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమా, తాజాగా విడుదలై నాలుగేళ్లు పూర్తి చేసుకుంది.
ఈ చిత్రంలో కేవలం భయపెట్టే హారర్ సన్నివేశాలు మాత్రమే కాకుండా, ప్రేక్షకులను కట్టిపడేసే బలమైన భావోద్వేగాలు (Emotions) ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు దీనికి కనెక్ట్ అయ్యారు. ఒక సాధారణ అమ్మాయి మసూద ఆత్మ ఆవహించడం, ఆమెను కాపాడుకునేందుకు తల్లి నీలం (సంగీత), పక్కనే ఉండే గోపి (తిరువీర్) చేసే ప్రయత్నాలు సినిమాను ఆద్యంతం ఉత్కంఠగా నడిపించాయి. తిరువీర్ సహజ నటనతో పాటు, కీలక పాత్రలో నటించిన నటి సంగీత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. అలాగే కావ్యా కల్యాణ్‌రామ్, శుభలేఖ సుధాకర్ తదితరుల నటన కూడా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, పకడ్బంది స్క్రీన్ ప్లే మరియు నేపథ్య సంగీతంతో ప్రేక్షకులకు సరికొత్త హారర్ అనుభూతిని పంచింది ‘మసూద’. ఈ సినిమా ఘన విజయం తిరువీర్ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, టాలీవుడ్లో కొత్త తరహా హారర్-థ్రిల్లర్ జోనర్‌కు సరికొత్త ఊపునిచ్చింది. విడుదలై ఇన్ని ఏళ్లు గడుస్తున్నప్పటికీ, ఈ సినిమా అందించిన భయంతో కూడిన థ్రిల్ మాత్రం ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోయింది. మరోవైపు ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడా అని ప్రేక్షకుల ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Masooda | తిరువీర్ కెరీర్లో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్.. ‘మసూద’ సినిమాకు 4 ఏళ్లు!
MLA Kova Lakshmi | పింఛన్, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ : ఎమ్మెల్యే కోవలక్ష్మి
ప్రజా సమస్యలకు దిక్కేది?.. మంత్రి ముఖం చాటేయడంపై సర్పంచుల నిరసన
Students | స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి.. రోడ్డెక్కిన విద్యార్థినులు.. వీడియో
పొన్నేకల్ వద్ద మినీ వ్యాన్ బోల్తా
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

