20న నావికాదళంలోకి అధునాతన జలాంతర్గామి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: మన సముద్ర జలాల వైపు చూడాలంటే శత్రుదేశాలు ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా రూపొందించిన వాగ్శీర్ జలాంతర్గామి వచ్చేస్తున్నది. ఈ నెల 20న ఇది నావికాదళం అమ్ములపొదిలో చేరనున్నది.