ఏదుల నుంచే డిండికి నీళ్లు.. అచ్చంపేట లిఫ్ట్‌కూ జలాలు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ప్రాజెక్టుకు నీళ్లను తరలించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని కూడా అక్కడి నుంచే చేపట్టాలని స్పష్టం చేశారు.
- శ్రీశైలం నుంచి అదనంగా 0.6 టీఎంసీల ఎత్తిపోతలు
- ప్రతిపాదనలు సిద్ధం చేయండి
- సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
- త్వరలో మహారాష్ట్ర సీఎంతో భేటీ.. తమ్మిడిహట్టిపై చర్చలు
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ప్రాజెక్టుకు నీళ్లను తరలించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని కూడా అక్కడి నుంచే చేపట్టాలని స్పష్టం చేశారు. రెండు లిఫ్ట్‌లకు కావాల్సిన 0.6 టీఎంసీల జలాలను, అదనంగా శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఎత్తిపోసుకొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ఎంసీహెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రు లు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. తమ్మిడిహట్టి బరాజ్‌తోపాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టులపై పీటముడిగా ఉన్న అంశాలన్నింటిపై చర్చించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉండాలని, త్వరలోనే చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల తెలిపారని వెల్లడించారు. ఆ చర్చలకు సంబంధించిన వివరాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, ఇటీవల ఢిల్లీలో సమావేశం సందర్భంగా సీడబ్ల్యూసీ కోరిన సమాచారాన్ని అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ఏదుల నుంచే డిండి, అచ్చంపేట లిఫ్ట్‌లు
డిండి ప్రాజెక్టుకు నీటిని నార్లాపూర్ నుంచి తీసుకోవాలా? ఏదుల నుంచి తీసుకోవాలా? అనే అంశంలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ప్రతినిధుల మధ్య కొనసాగుతున్న వివాదాలు, అభ్యంతరాలు, విజ్ఞప్తులపై ఈ సమీక్షలో చర్చించారు. ఎక్కడినుంచి తరలిస్తే ఎంత ఖర్చవుతుంది? తదితర వివరాలన్నీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

