రాయలసీమ ప్రాజెక్టు పూర్తి అసంబద్ధమైనది : సీఎం కేసీఆర్
రాయలసీమ ప్రాజెక్టు | ప్రాణం పోయినా సరే నీళ్ల విషయంలో రాజీపడే సమస్య ఉత్పన్నం కానేకాదు. రాయలసీమ ప్రాజెక్టుపై అన్ని రకాలుగా ఫైట్ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

హైదరాబాద్ : ప్రాణం పోయినా సరే నీళ్ల విషయంలో రాజీపడే సమస్య ఉత్పన్నం కానేకాదు. రాయలసీమ ప్రాజెక్టుపై అన్ని రకాలుగా ఫైట్ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా రాయలసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ప్రాజెక్టుపై స్టేలు కూడా ఉన్నాయి. జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా స్టే ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి తాము కూడా ఫిర్యాదు చేశాం. ఆ ప్రాజెక్టు పూర్తి అసంబద్ధమైనదని కేంద్రానికి చెప్పాం. అన్ని రకాలుగా ఫైట్ చేస్తాం.. దాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. రాజీపడే ప్రశ్న ఉత్పన్నం కానేకాదు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. అవసరమైతే శాసనసభ సభ్యులందరూ ఢిల్లీలో కూర్చొనైనా.. పోరాడుతాం కానీ మన నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రశ్న ఉత్పన్నమే కాదని స్పష్టం చేశారు.
ఆర్డీఎస్ విషయంలో ఏపీ నాయకులు మొండిగా ముందుకు పోతున్నారు. పాత పద్ధతిలో వెళ్తామంటే ఇవాళ తెలంగాణ దిక్కులేని స్థితిలో లేదు. ఆర్డీఎస్లో కచ్చితంగా 15.9 టీఎంసీల నీటిని తీసుకుంటాం. ఒక్క బొట్టు నీటిని కూడా వదలం అని సీఎం తేల్చిచెప్పారు. తెలంగాణ స్వయంప్రతిపత్తి గల రాష్ర్టం.. ఆరాచకం జరగనివ్వం.. హక్కులను కాపాడుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రాష్ర్టంలో లాక్డౌన్ విధించం : సీఎం కేసీఆర్
జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు శుభవార్త
పాలమూరును అన్నపూర్ణ జిల్లాగా మారుస్తాం : మంత్రి హరీష్ రావు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

