MLA Anirudh Reddy | డ్రగ్స్ యాక్టివిటీస్ ఎక్కువగా జరిగేది సినీ పరిశ్రమలోనే అని నేను కాదు.. పబ్లిక్ అంటుంటారు. అవి రూమర్లా.. నిజమా తెల్వదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చూసిన సినిమాల్లో చిరంజీవి, పవన్ కల్యాన్, బాలకృష్ణ అభిమానులుంటారు. మేము చెప్పేదాని కంటే వాళ్లు చెప్తేనే పబ్లిసిటీ ఎక్కువ. వాళ్లు డ్రగ్స్ టెస్ట్ చేసుకుని మేమంతా క్లియర్‌గా ఉన్నామంటే.. పబ్లిక్తోపాటు అభిమానుల్లో మా యాక్టర్ డ్రగ్ అడిక్ట్ కాదు. మేం కూడా డ్రగ్స్ దగ్గరకు పోవద్దని అనుకుంటారన్నారు.
సినీ పరిశ్రమలో ఉన్నవారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే డ్రగ్స్ చేయించుకోండి. నేను కూడా చేయించుకున్నా. నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను డ్రగ్స్ తీసుకోను.. కానీ ఎందుకు టెస్ట్ చేయించుకున్నా అంటే.. జడ్చర్ల ప్రజలు ఎలాంటి ఎమ్మెల్యేను ఎన్నుకున్నరనేది వాళ్లకు అర్థం కావాలి… ప్రతీ 90 రోజులకోసారి సినీ సెలబ్రిటీలు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి లేదంటే డ్రగ్స్ తీసుకున్నట్టేనన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అందరు స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే సినిమాలు రిలీజ్ చేయనివ్వాలన్నారు.
స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేసుకుని, డ్రగ్స్ తీసుకోవడం తప్పని చెప్తే, వారి అభిమానులు కూడా ఆ దారిలోనే నడుస్తారని అన్నారు. ప్రతీ 90 రోజులకు ఒకసారి సినీ సెలబ్రిటీలు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి లేదంటే డ్రగ్స్ తీసుకున్నట్లేన్నారు. ఇప్పుడీ కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అందరు స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే సినిమాలు రిలీజ్ చేయనివ్వాలి
బిగ్గెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ పరిశ్రమలోనే
స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేసుకుని, డ్రగ్స్ తీసుకోవడం తప్పని చెప్తే, వారి అభిమానులు కూడా ఆ దారిలోనే నడుస్తారు… https://t.co/qf8FPDTs4T pic.twitter.com/rzOVHi5pCo
— Telugu Scribe (@TeluguScribe) March 31, 2026
Prabhas | ఒకేసారి మూడు పాన్ ఇండియా చిత్రాలతో బిజీ.. ప్రభాస్ స్పీడ్‌కు ఇండస్ట్రీ షాక్!
Harish Rao | కేరళ ఎన్నికలు మీకు అవసరమేమో..? మాకు ప్రజా సమస్యలే ముఖ్యం : హరీష్ రావు
Leander Paes: బీజేపీలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్