9 మంది ధరణి ఆపరేటర్స్ అరెస్టు?
తెలంగాణ సీఐడీ అధికారులు హైదరాబాద్ నగర పరిసరాల్లో రెండ్రోజులుగా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి తొమ్మిది మంది ధరణి ఆపరేటర్లను అరెస్టు చేశారని తెలిసింది.
- సీఐడీ సెట్ రహస్య ఆపరేషన్!
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సీఐడీ అధికారులు హైదరాబాద్ నగర పరిసరాల్లో రెండ్రోజులుగా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి తొమ్మిది మంది ధరణి ఆపరేటర్లను అరెస్టు చేశారని తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా స్పెషల్ ఎంక్వైరీ టీమ్ (సెట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ధరణిపై దర్యాప్తు చేపట్టిన సెట్ అధికారులు హైదరాబాద్ పరిసరాల్లోని రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో ఈ అరెస్టులు చేసినట్టు సమాచారం. తమవారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, వారి ఆచూకీ తక్షణం తెలుపాలని డిమాండ్ చేస్తూ.. బాధిత కుటుంబాలకు చెందిన వారు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

