మార్చి 11 గురువారం మహా శివరాత్రి సందర్భంగా ఆలయాలు శివనామస్మరణతో మారు మ్రోగాయి. భక్తులు ఆ కైలాసనాథుడికి పూజలు చేస్తూ భక్త పారవశ్యంలో మునిగి తేలారు. ఉపవాసాలు, జాగారాలు చేశారు. కరోనా ఉన్నప్పటికీ నిబంధనలు పాటిస్తూ ఆలయాలలో నిర్వహించిన పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. సెలబ్రిటీలు సైతం శివుడికి పూజులు చేసారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి తన ఇంట్లో మహా శివుడికి పూజాభిషేకం చేశారు.
తన ట్విట్టర్లో పూజాభిషేకంకు సంబంధించిన వీడియో షేర్ చేసిన చిరు కామెంట్గా కింది శ్లోకాలు జత చేశారు. సంప్రదాయ దుస్తులలో చిరు కనిపించి అలరించారు. చిరు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
మహాప్రాణ దీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవాని సమేతం భజే మంజునాధం
అందరికి శివరాత్రి శుభాకాంక్షలు.
ఈ శివరాత్రి నాడు మహాశివుడుకి పూజాభిషేకం