చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నిరంజన్ రెడ్డి నిర్మాత. ఫిబ్రవరి 4న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమాలో చిరంజీవి ఆచార్యగా నటిస్తుండగా, సిద్ధ అనే శక్తివంతమైన పాత్రలో రామ్‌చరణ్ కనిపించనున్నారు. ఆదివారం సిద్ధ పాత్ర తాలూకు టీజర్‌ను విడుదల చేశారు. ధర్మస్థలి నేపథ్యంలో నడిచే ఈ కథలో అక్కడి ప్రజలకు అండగా ఉంటే సిద్ధ అనే యువకుడిగా రామ్‌చరణ్ పాత్రను చూపించారు. ‘ధర్మస్థలికి ఆపదొస్తే అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే ఆవహించి మమ్మల్ని ముందుకుపంపుద్ది’ అంటూ ప్రతినాయకులను హెచ్చరిస్తూ రామ్‌చరణ్ చెప్పిన సంభాషణ రొమాంచితంగా అనిపించింది. దేవుడి మాన్యాల అన్యాక్రాంతం..వాటి సంరక్షించుకునేందుకు చేసే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలిసింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాల్ని అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణ్ణావుక్కరసు, నిర్మాణ సంస్థలు: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, రచన-దర్శకత్వం: కొరటాల శివ.