మనం బాగుపడటానికి ఇతరులను ఉపయోగించుకోవడం కన్నా, ఇతరుల బాగు కోసం మనం త్యాగం చేయగలిగితే దేవుణ్ని ప్రేమిస్తున్నట్టే.
ఇతరుల బాధను మనం అనుభవించి, వారి ఆనందంలో భాగం కాగలగడం గొప్ప అదృష్టం.
మన దురదృష్టానికి చింతించడానికి బదులు, చాలామంది ఇతరుల కన్నా మనం అదృష్టవంతులం అని భావించగలగడం ఉత్తమ లక్షణం అనిపించుకుంటుంది.
మనకు కలిగిన దానిని భగవదేచ్ఛగా అంగీకరించి, దానిని తృప్తిగా స్వీకరించే గొప్ప మనసును అలవర్చుకోవాలి.
ఈ సృష్టిలోని జీవరాశులకు ఎలాంటి అపకారం కలిగించకుండా ఉండటమే భగవంతుడికి అర్పించగల అత్యున్నతమైన భక్తి.
మెహర్ బాబా
(నేడు మెహర్బాబా అమర తిథి)