లక్నో: అనవసరంగా గొప్పలకు పోవడం, ఆ తర్వాత చతికిలపడటం బీజేపీ నేతలకు కొత్తేంకాదు. తాజా ఘటన మరోసారి దీన్ని రుజువుచేస్తున్నది. నోయిడాలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ప్రధాని మోదీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఓ వీడియోను విడుదల చేసింది. అయితే, చైనా రాజధాని బీజింగ్‌లోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఫొటోను ‘నోయిడా’ ఎయిర్‌పోర్టుగా అందులో చూపించారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సహా పలువురు బీజేపీ నేతలు ముందూవెనుక ఆలోచించకుండా ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇంకేముంది, ఈ వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. పక్కవారి అభివృద్ధిని కూడా తమ ఖాతాలో వేసుకోవడం కాషాయ నేతలకు కొత్తేంకాదని ట్రోల్ చేశారు.