Vaccine Diplomacy : చైనా వ్యాక్సిన్ దౌత్యం
Vaccine Diplomacy : పంచవ్యాప్తంగా పలు దేశాలకు 20 లక్షల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసేందుకు చైనాలోని జీ జిన్‌పింగ్ ప్రభుత్వం నిర్ణయించింది. చైనా చేపడుతున్న వ్యాక్సిన్ సరఫరాను వ్యాక్సిన్ దౌత్యంగా

బీజింగ్ : తమపై ఉన్న చెడ్డ పేరును చెరిపేసుకునేందుకు చైనా తాపత్రయపడుతున్నది. మంచి పనులు చేయడం ద్వారా ప్రపంచ దేశాల్లో మంచివారుగా పేరు తెచ్చుకునేందుకు చైనా ఉవ్వీళ్లూరుతున్నది. అందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు 20 లక్షల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసేందుకు చైనాలోని జీ జిన్‌పింగ్ ప్రభుత్వం నిర్ణయించింది. చైనా చేపడుతున్న వ్యాక్సిన్ సరఫరాను వ్యాక్సిన్ దౌత్యంగా (Vaccine Diplomacy) పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 50 కోట్ల డోసులు ఇచ్చేందుకు అమెరికా ఇప్పటికే ప్రకటించింది.
ప్రపంచ దేశాలను డేల్టా వేరియంట్ భయపెట్టిస్తున్నది. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని దేశాల్లో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సమయంలో చాలా దేశాలు కొవిడ్ వ్యాక్సిన్ల కోసం వెంపర్లాడుతున్నాయి. అయితే, డిమాండ్‌కు తగినట్లుగా వ్యాక్సిన్ సరఫరా లేకపోవడంతో.. వ్యాక్సిన్లు అందించేందుకు చైనా ముందుకొచ్చింది. వ్యాక్సిన్ మార్కెట్‌ను గుప్పిట్లో పెట్టుకోవడంతోపాటు తమపై ఉన్న చెడ్డ పేరును తొలగించుకేనేందుకు ఈ డిమాండ్‌ను చైనా సొమ్ము చేసుకొంటున్నది. ఈ నెలాఖరులోకి ప్రపంచంలోని పలు దేశాలకు 20 లక్షల వ్యాక్సిన్ డోసులను అందించనున్నట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రెండు రోజుల క్రితం సీసీటీవీ ద్వారా విడుదల చేసిన ఒక వీడియో ప్రసంగంలో వెల్లడించారు.
అయితే, ఎంత ధరకు వీటిని అమ్మనున్నారు? పేద దేశాలకు ఎంత మేర ఉచితంగా ఇవ్వనున్నారనే విషయాలను మాత్రం జిన్‌పింగ్ స్పష్టం చేయలేదు. ఎలా సరఫరా చేస్తారనేది కూడా ఆయన పేర్కొనకపోవడం విశేషం. పేద దేశాలకు వ్యాక్సిన్లు అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నెలకొల్పిన ‘కొవాక్స్’ కార్యక్రమానికి చేయూతనిచ్చేందుకు చైనా సుముఖత వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమానికి తమ వంతుగా రూ.10 కోట్ల విలువైన వ్యాక్సిన్లు అందజేస్తామని జిన్‌పింగ్ తెలిపారు.
టీకా దౌత్యంపై చైనా-అమెరికా మధ్య పోటీ నెలకొన్నది. అవసరమైన దేశాలకు 10 కోట్ల వ్యాక్సిన్లను విరాళంగా ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. వచ్చే నెల నుంచి అమెరికా 50 కోట్ల డోసుల ఫైజర్ వ్యాక్సిన్‌ను అందివ్వనున్నది. ఈ మోతాదులు 100 పేద దేశాలకు ఇవ్వనున్నారు.
ఇవి కూడా చదవండి..
ఓలా స్కూటర్లో రివర్స్ గేర్..
కుంభమేళాలో నకిలీ కొవిడ్ పరీక్షలు.. ఈడీ తనిఖీలు
హక్కులు-బాధ్యతల మధ్య సమన్వయం అవసరం: వెంకయ్య
జరాంజ్‌ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లు
షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవాలా..? ఈ ఆహారాలను ట్రై చేయండి
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

