చర్లపల్లి, జనవరి 8 : తల్లిదండ్రులు అపోహలు విడనాడి.. పిల్లలకు విధిగా వ్యాక్సిన్ వేయించాలని ఏఎస్‌రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి అన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని ఒమెగా డిగ్రీ, జూనియర్ కాలేజీలో శుక్రవారం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించకుండా ప్రతి ఒక్కరూ మా స్కు ధరించాలని సూచించారు. డివిజన్ పరిధిలోని కాలనీవాసులు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్చార్జి డాక్టర్ సంపత్ పర్యవేక్షణలో సుమారు 400మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో వైద్యులు సాగరిక, అనురాధ, హెల్త్ అసిస్టెంట్లు విజయ, రాణి, రాధిక, ఒమెగా కాలేజీ కారస్పాండెంట్ సీతారామిరెడ్డి, నిర్వాహకులు రాజ్నారాయణరెడ్డి, శివభవానీ, వాసుదేవ్, గంగాధర్, యాదగిరి, మంజుల, పరమేశ్వరి, శైలజ, ప్రణీత పాల్గొన్నారు.