తల్లికి తలకొరివి పెట్టని బిడ్డలు
కన్నబిడ్డలున్నా.. చివరి మజిలీలో అక్కరకు రాకుండాపోయారు. ఆ తల్లికి గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులే తలకొరివి పెట్టారు.
- ముందుకొచ్చిన జీపీ సిబ్బంది
- జనగామ జిల్లా తరిగొప్పులలో సాగనంపిన గ్రామస్తులు
తరిగొప్పుల, నవంబర్ 23 : కన్నబిడ్డలున్నా.. చివరి మజిలీలో అక్కరకు రాకుండాపోయారు. ఆ తల్లికి గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులే తలకొరివి పెట్టారు. వివరాలిలా.. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన నాగబండి రామచంద్రం-పుష్పనీల దంపతులకు కుమారుడు, ఐదుగురు కుమార్తెలు ఉండగా, రెండో కూతురు చనిపోయింది. గతంలోనే రామచంద్రం చనిపోగా, పుష్పనీల సోమవారం మృతి చెందింది.
తల్లి మరణించిందని హైదరాబాద్లో ఉంటున్న కొడుకుకు గ్రామస్తులు ఫోన్లో సమాచారమివ్వగా తాను రాలేనని సమాధానమిచ్చాడు. ఇద్దరు కుమార్తెలు వచ్చినా, తలకొరివి పెట్టేందుకు నిరాకరించారు. దీంతో పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నాగబండి కుటుంబానికి చెందిన ఆర్యవైశ్య కులస్తులు, గ్రామస్తులు పాడె మోశారు. కన్నబిడ్డలున్నా తలకొరివి పెట్టడానికి ముందుకు రాకపోవడం గ్రామస్తులను కలిచివేసింది. కన్నవారు కాదనుకున్నా.. కడసారి కన్నీరు పెట్టి సాగనంపారు గ్రామ ప్రజలు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

