చికెన్ పావ్‌బాజీ
చికెన్‌ను చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక గిన్నెలో చికెన్, ఒక టీస్పూన్ కారం, ధనియాల పొడి, సగం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పెరుగు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి గంటపాటు నానబెట్టాలి. సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి బాగా వేయించి.. అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన టమాట ముక్కలు వేసి సన్నని మంటపై మగ్గించాలి. టమాట బాగా ఉడికిన తర్వాత.. చికెన్ మిశ్రమం వేసి సన్నని మంటపై పావుగంట ఉడికించాలి
కావలసిన పదార్థాలు
బ్రెడ్(పావ్) ముక్కలు: నాలుగు, చికెన్(బోన్‌లెస్): పావు కిలో, పెరుగు: పావు కప్పు, పసుపు: పావు టీస్పూన్, కారం: రెండు టీస్పూన్లు, ధనియాల పొడి: ఒక టీస్పూన్, చాట్ మసాలా: ఒక టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, కొత్తిమీర, పుదీనా తురుము: కొద్దిగా, నూనె: ఒక టేబుల్ స్పూన్, చీజ్ తురుము: పావు కప్పు, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, నిమ్మరసం/వెనిగర్: ఒక టీస్పూన్, టమాట: ఒకటి.
తయారీ విధానం
చికెన్‌ను చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక గిన్నెలో చికెన్, ఒక టీస్పూన్ కారం, ధనియాల పొడి, సగం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పెరుగు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి గంటపాటు నానబెట్టాలి. సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి బాగా వేయించి.. అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన టమాట ముక్కలు వేసి సన్నని మంటపై మగ్గించాలి. టమాట బాగా ఉడికిన తర్వాత.. చికెన్ మిశ్రమం వేసి సన్నని మంటపై పావుగంట ఉడికించాలి. చివరగా కొత్తిమీర, పుదీనా, చాట్‌మసాలా వేసి బాగా కలిపి దింపేయాలి.
స్టవ్‌మీద గిన్నె పెట్టుకుని.. వెన్న వేసి, వేడయ్యాక సన్నగా తురిమిన వెల్లుల్లి, ఒక టీస్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర తురుము వేసి పక్కనపెట్టాలి. స్టవ్‌మీద పెనం పెట్టి వేడి చెయ్యాలి. బ్రెడ్ పావ్లను మధ్యలోకి కట్‌చేసి వెన్న రాసి చికెన్ మిశ్రమం పరిచి పైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, చీజ్ వేసుకోవాలి. వీటిని పెనంపై పెట్టి వెల్లుల్లి, వెన్న మిశ్రమం వేస్తూ ఒక నిమిషంపాటు రెండువైపులా కాల్చుకుంటే నోరూరించే చికెన్ పావ్‌బాజీ సిద్ధం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | పరిహారం పొందిన భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఎలా?.. ప్రజావాణిలో దేశాయిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

