IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. చెపాక్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌పై 12 పరుగుల తేడాతో గెలిచింది. సొంత అభిమానుల సమక్షంలో బ్యాటర్లు చెలరేగడంతో చెన్నై రెండొందలు కొట్టింది. ఆ తర్వాత లక్నోను 205కే ధోనీ సేన కట్టడి చేసింది. మోయిన్ అలీ కీలక వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టాడు. అయుష్ బదొని (23), కృష్ణప్ప గౌతమ్(10) ధాటిగా ఆడిన లక్నోను గెలిపించలేకపోయారు.
చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ రెండొందలు కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ ముందు 218 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్ ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ కైలీ మేయర్స్(53) ధాటిగా ఆడాడు. కేఎల్ రాహుల్(20)తో కలిసి మొదటి వికెట్‌కు 79 పరుగులు జోడించాడు. స్పిన్నర్లను రంగంలోకి దింపిన ధోనీ ఫలితం రాబట్టాడు. మోయిన్ అలీ డేంజరస్ మేయర్స్(53)ను ఔట్ చేసి సీఎస్కేకు బ్రేక్ ఇచ్చాడు. దీపక్ హుడా (1), కేఎల్ రాహుల్(20), కృనాల్ పాండ్యా(9) విఫలమయ్యారు. మార్కస్ స్టోయినిస్(21)ను మోయిన్ అలీ బౌల్డ్ చేసి ఆ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు. అయితే.. నికోలస్ పూరన్(31) ఉన్నంత సేపు సిక్స్‌లతో భయపెట్టాడు. చెన్నై బౌలర్లలో మోయిన్ అలీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్‌పాండే రెండు, శాంటర్న్ ఒక వికెట్ తీశారు.
సొంత గ్రౌండ్లో రెచ్చిపోయిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(57) హాఫ్ సెంచరీ బాదాడు. డెవాన్ కాన్వే(47), శివం దూబే (27),. మోయిన్ అలీ (19) రాణించారు. చివర్లో అంబటి రాయుడు(27) ధాటిగా ఆడి స్కోర్ రెండొందలు దాటించాడు. మార్క్ వుడ్ వేసిన ఆఖరి ఓవర్లో ఎంఎస్ ధోనీ(12) వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. దాంతో, 14 రన్స్ వచ్చాయి. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, మార్క్ వుడ్ తలా మూడు వికెట్లు తీశారు. అవేశ్ ఖాన్‌కు ఒక వికెట్ దక్కింది. గుజరాత్ టైటన్స్‌పై దంచి కొట్టిన రుతురాజ్ గైక్వాడ్(57) లక్నోపై చెలరేగాడు. 25 బంతుల్లోనే రెండు ఫోర్లు, 4 సిక్స్‌లతో ఈ ఓపెనర్ యాభై రన్స్ కొట్టాడు. ఈ టోర్నీలో రెండో హాఫ్ సెంచరీ బాదాడు. డెవాన్ కాన్వే(47)తో కలిసి తొలి వికెట్‌కు 110 రన్స్ జోడించాడు.