కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు
సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కాంగ్రెస్ నేతపై కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు సోమవారం చీటింగ్ కేసు నమోదు చేశారు.
- రూ.6.91 కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి
కొత్తగూడెం గణేశ్ టెంపుల్/కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 2 : సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కాంగ్రెస్ నేతపై కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు సోమవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడైన కొత్తగూడెం కాంగ్రెస్ నాయకుడు, మురళీకృష్ణ రైస్‌మిల్లు యజమాని ఆళ్ల మురళితోపాటు కోపార్ట్నర్ అంజనమ్మపై కేసు నమోదైంది. 2025-26లో రైతుల నుంచి సేకరించిన 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లు పట్టించేందుకు కొత్తగూడెంలోని మేదరబస్తీ లో గల శ్రీజ రైస్ మర్చంట్ (మురళీకృష్ణ రైస్) మిల్లుకి సివిల్‌సైప్లె విభాగం అప్పగించింది.
ధాన్యాన్ని మిల్లు పట్టించిన అనంతరం ప్రభుత్వాని కి అప్పగించాల్సి ఉండగా ఆ మిల్లు యజమాని పక్కదారి పట్టించినట్టు విజిలెన్స్ విభాగం విచారణ జరిపి సివిల్సైప్లెశాఖకు సమాచారం అందించింది. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ త్రినాథ్‌బాబు బృందం ఈ నెల 28న మురళీకృష్ణ రైస్‌మిల్లుపై దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లు పట్టి 600 మెట్రిక్ టన్నులు సివిల్‌సైప్లె విభాగానికి అప్పగించి, రూ.6.91 కోట్లు విలువ చేసే రు 1,751 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్టు అధికారులు నిర్ధారించారు.
త్రినాథ్‌బాబు ఫిర్యాదు మేరకు కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బియ్యాన్ని దారి మళ్లించిన కేసులో కాంగ్రెస్ నాయకుడు ఆళ్ల మురళిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ జైభీమ్‌రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వరింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేశ్ సోమవారం ఆ పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.
గద్వాల జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు
సివిల్‌సైప్లె అధికారులు జోగుళాంబ గద్వాల జిల్లా దువాసిపల్లిలోని వేంకటేశ్వర రైస్‌మిల్లును తనిఖీ చేయగా రూ.8 కోట్ల విలువచేసే ధాన్యం మాయమైనట్టు గుర్తించి, కోదండాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లాలోని 49 మిల్లులకు 1,34,495.72 మెట్రిక్ టన్నుల ధాన్యం సరఫరా చేయగా 41.83 మెట్రిక్ టన్నుల ధాన్యం అందించగా మిగతా పక్కదారి పట్టినట్టు తెలిసింది. దువాసి మిల్లు 10 ఏసీకేలు, బీరెల్లి రహదారిలో ఉన్న మిల్లు యజమాని 5 ఏసీకేలు ప్రభుత్వానికి దొడ్డు బియ్యం పెట్టి సివిల్ సప్లయ్ శాఖను మోసం చేశారు. ఈ మిల్లులపై కలెక్టర్‌కు అధికారులు నివేదికను సమర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

