దర్శకుడు నక్కిన త్రినాథరావు నిర్మిస్తున్న క్రైమ్ కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’. నిఖిల్ గొల్లమారి దర్శకుడు. ఇంద్రరామ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఏప్రిల్ 18న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని మంగళవారం విడుదల చేశారు. హీరో నాగచైతన్య ఈ టీజర్‌ని లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. థ్రిల్లింగ్ క్రైమ్ ఎలిమెంట్స్‌తో.. డార్క్ హ్యూమర్ బ్లెండ్‌తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఒక సరదా ప్రయాణంలా సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, మస్త్ అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: దేవ్ జాంద్, సహనిర్మాత: చూడామణి, నిర్మాణం: నక్కిన నెరేటివ్.