హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన ఎయిర్ మార్షల్ బీ చం ద్రశేఖర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన చంద్రశేఖర్.. మహారాష్ట్రలోని ఖడక్వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. 1984లో భారత వాయుసేనలో చేరిన ఆయనకు వివిధ రకాల హెలికాప్టర్లు, ఎయిర్క్రాప్ట్లు నడపడంలో 5,400 గంటల అనుభవం ఉన్నది. భారత వాయుసేనలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉత్తమ సేవలకుగాను 2020లో రాష్ట్రపతి నుంచి అతి విశిష్ట సేవా మెడల్‌ను సైతం పొందారు. చంద్రశేఖర్ భార్య బ్యాంకు ఉద్యోగి. వీరికి కుమారుడు, కూతురు. వీరు భారత వాయుసేనలో కమిషన్డ్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు.