హర్షదీప్ ఖలిస్తానీ.. వికీపీడియాకు సమన్లు
న్యూఢిల్లీ: యువ పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్.. పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో క్యాచ్ డ్రాప్ చేసిన విషయం తెలిసిందే. కీలక దశలో ఆ క్యాచ్ వదిలేయడం వల్ల అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హర్షదీప్ వికీపిడియా పేజీలో మార్పులు కూడా జరిగాయి. క్యాచ్ వదిలేసిన హర్షదీప్.. ఖలిస్తానీ అంటూ దాంట్లో ఎడిట్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వికీపిడియా ప్రతినిధులకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సమన్లు జారీ చేసింది. హర్షదీప్ సింగ్ వికీపిడియా పేజీని ఎలా మార్చారని, ఖలిస్తానీ లింకును ఎలా జోడించారో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థను కోరినట్లు తెలుస్తోంది.
వికీపిడియాలో హర్షదీప్ ఐడెంటీని మార్చడం వల్ల అది దేశానికి ప్రమాదంగా మారే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. హర్షదీప్ కుటుంబానికి కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కేంద్రం పేర్కొన్నది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో ఇండియా ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ తర్వాత వికీపిడియా పేజీలో హర్షదీప్ ప్రొఫైల్‌లో మార్పులు కనిపించాయి. పాక్‌తో మ్యాచ్‌లో హర్షదీప్ క్యాచ్‌ను జారవిడచడం వల్ల ఇండియా ఓడిపోయినట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే ఖలిస్తానీ జాతీయ క్రికెట్ జట్టుకు హర్షదీప్ ఆడుతున్నాడని వికీపిడియాలో ఎడిట్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

