జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు వైద్యం కోసం వచ్చిన రోగులకు రక్షణ కరువైంది. గతంలో దవాఖాన నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఓ అధికారిని బదిలీ అయి, కొత్త సారు వచ్చినా దవాఖాన తీరు మారడంలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ)సీలింగ్ కూలిపోవడం కలకలం రేపింది. పై కప్పు కూలిన సమయంలో వార్డులో శిశువులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్ఎన్సీయూ భవనం పైకప్పు పెచ్చులు ఊడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడమేంటని రోగులు మండిపడుతున్నారు. 15 రోజుల క్రితం ఓ గదిలో పైకప్పు పెచ్చులు ఊడాయని, ఎలాం టి ప్రాణహాని జరుగలేదని సూపరింటెండెంట్ వెంకటరత్నంను వివరణ ఇచ్చారు.