The Hunt For Veerappan | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix).. ది హంట్ ఫర్ వీరప్పన్ (The Hunt For Veerappan) పేరుతో డాక్యుమెంటరీని తీసిన విషయం తెలిసిందే. కర్ణాటక.. తమిళనాడు అడవీ ప్రాంతాలను శాసించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ (Veerappan Biography) జీవిత చరిత్ర ఆధారంగా ఈ డాక్యుమెంటరీని తీశారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా.. ఈ సిరీస్ షూటింగ్లో భాగంగా.. వీరప్పన్ భార్య (Veerappan’s wife) ముత్తులక్ష్మి (Muthulakshmi)తో చేసిన ఇంటర్వ్యూ వీడియోను నెట్‌ఫ్లిక్స్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది.
ఈ వీడియోలో ముత్తులక్ష్మి (Muthulakshmi) మాట్లాడుతూ.. “ఒక పెద్ద అల్బిజా చెట్టు (Albizia Tree) ఉంటే దాని వెనుక నేను నిలబడ్డాను. అప్పుడు వీరప్పన్ నా దగ్గరకు వచ్చి ముత్తు ఇక్కడికి రా నీతో మాట్లాడాలి అన్నాడు. నా మనసులో అనుకున్న ఈ వ్యక్తికి నా పేరు ఎలా తెలిసిందని. అంతలోనే వీరప్పన్ దగ్గరకు వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న ముత్తు.. దాని గురించి నువ్వు ఏమనుకుంటున్నవు. ఒకవేళ నాతో పెళ్లి ఇష్టం లేకపోతే చేప్పు.. నువ్వు వద్దన్న ఈ జన్మలో నేను వేరే స్త్రీ వైపు చూడను. నా గుండెను రాయి చేసుకుంటాను అన్నాడు. దాంతో నా ఈ రాతి గుండెను కరిగిందంటూ” ముత్తులక్ష్మి చెప్పుకోచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
Catch the story of Veerappan’s wife, Muthulakshmi as she describes their life together amidst the #TheHuntForVeerappan.
Now streaming in English, Hindi, Tamil, Telugu, Kannada & Malayalam. pic.twitter.com/SXZqhCEJ2V
— Netflix India (@NetflixIndia) August 6, 2023
నాలుగు ఎపిసోడ్స్‌తో ఉన్న ఈ డాక్యుమెంట్ సిరీస్‌ను ఢిల్లీ క్రైమ్ నిర్మాత అపూర్వ బక్షి (Apoorva Bakshi) నిర్మిస్తుండగా.. సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దర్శకత్వం వహించారు.