ఏఈఈ, ఎస్ఎస్సీ జేఈ పరీక్షల తేదీల్లో క్లాష్
టీజీపీఎస్సీ నిర్వహించనున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ-సివిల్) పరీక్షల తేదీలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించే జూనియర్ ఇంజినీర్ (జేఈ) పరీక్షలు ఒకే సమయంలో రావడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల షెడ్యూల్ను పునఃపరిశీలించి, అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ తేదీలు కేటాయించాలని కోరుతూ తెలంగాణకు చెందిన సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు టీజీపీఎస్సీ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
- పరీక్షల షెడ్యూల్ మార్చాలని టీజీపీఎస్సీకి అభ్యర్థుల విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ నిర్వహించనున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ-సివిల్) పరీక్షల తేదీలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించే జూనియర్ ఇంజినీర్ (జేఈ) పరీక్షలు ఒకే సమయంలో రావడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల షెడ్యూల్ను పునఃపరిశీలించి, అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ తేదీలు కేటాయించాలని కోరుతూ తెలంగాణకు చెందిన సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు టీజీపీఎస్సీ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. టీజీపీఎస్సీ ఈ నెల 28న విడుదల చేసిన పరీక్షల షెడ్యూల్ ప్రకారం.. ఏఈఈ (సివిల్), రోడ్లు-భవనాల శాఖలోని పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నవంబర్ 6, 7 తేదీల్లో నిర్వహిస్తారు. మరోవైపు ఎస్ఎస్సీ జూనియర్ ఇంజినీర్ పరీక్షలు నవంబర్ 2 నుంచి 6 వరకు జరుగుతాయి. దీంతో రెండు పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థులు ఏదో ఒక పరీక్షను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అభ్యర్థులు వినతిపత్రంలో వివరించారు. ఈ రెండు నియామక పరీక్షల కోసం వేలాది మంది అభ్యర్థులు రెండేండ్లుగా సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఈ రెండు పరీక్షలూ ఉద్యోగావకాశాలపరంగా కీలకమైనవని, తేదీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

