Akhanda 2 |టాలీవుడ్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్‌లలో ‘అఖండ 2’ ఒకటి. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయానంతరం వస్తున్న సీక్వెల్ కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ పీక్స్‌కి చేరింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపింది. బాలయ్య పవర్ఫుల్ లుక్, బోయపాటి స్టైల్ మాస్ ఎలివేషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
సినిమా షూటింగ్, డబ్బింగ్ పూర్తయ్యాయి. అయితే, విజువల్ ఎఫెక్ట్స్ (గ్రాఫిక్స్) పనులు ఇంకా వేగంగా సాగుతున్నాయి. మేకర్స్ ముందుగా ప్రకటించిన డిసెంబర్ 5 రిలీజ్ ఇప్పటికి అనుమానాస్పదంగా మారింది. రిలీజ్‌కి ఇంకా 20 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ, ప్రమోషన్స్‌లో అంత వేగం కనిపించకపోవడంతో మూవీ విడుదలపై అనుమానాలు మొదలయ్యాయి. అంతేకాక ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, మేకర్స్ ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ పై దృష్టి పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కావాల్సిన రాజాసాబ్ సినిమా పనులు పూర్తి కావడం లేదని , దీంతో ఆ స్లాట్ ఖాళీ కావచ్చని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆ తేదీకి అఖండ 2ను రిలీజ్ చేసేందుకు టీమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇదే నిజమైతే, ఈసారి సంక్రాంతికి బాలయ్య vs చిరంజీవి బాక్సాఫీస్ క్లాష్ జరిగే అవకాశం ఉంది. చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు చిత్రం’తో రానుండగా, బాలయ్య ‘అఖండ 2’తో దుమ్మురేపేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాలో “అఖండ 2 ఎప్పుడు రిలీజవుతుంది?”, “సంక్రాంతికేనా?” అని ప్రశ్నలు కురిపిస్తున్నారు. మేకర్స్ త్వరలోనే రిలీజ్‌పై స్పష్టమైన ప్రకటన ఇవ్వనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో అఖండ 2 రిలీజ్ డేట్ చర్చ హాట్ టాపిక్‌గా మారింది.