ప్రస్తుతం పఠాన్ చిత్రంలో నటిస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ఖాన్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీ రోల్ పోషిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. సల్మాన్‌ఖాన్ అండ్ టీం షూటింగ్ కోసం త్వరలోనే రష్యాలో ల్యాండ్ కానుందట. అక్కడ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించేందుకు ప్లాన్ రెడీ చేసినట్టు బీటౌన్ వర్గాల టాక్.
జాన్ అబ్రహాం, దీపికా పదుకొనే ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2022లో పఠాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రముఖ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. జీరో చిత్రంలో ఓ పాటలో షారుక్‌తో కలిసి మెరుస్తాడు సల్మాన్. మళ్లీ చాలా రోజుల విరామం తర్వాత ఈ ఖాన్లిద్దరూ సిల్వర్ స్క్రీన్‌ను షేర్ చేసుకుంటుండటంతో ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు అభిమానులు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.