కళ్లెం డెయిరీ బీఆర్ఎస్ కైవసం
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కళ్లెం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరిగిన సంఘం ఎన్నికల్లో తొమ్మిది డైరెక్టర్ స్థానాలకు గాను అన్నింటినీ గెలుచుకొని బీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది.
- ఖాతా తెరువని కాంగ్రెస్ పార్టీ
- తొమ్మిది మంది డైరెక్టర్లతో గులాబీ పార్టీ క్లీన్ స్వీప్
- సొసైటీ చైర్మన్‌గా ఎన్నికైన జిల్లెల పాపిరెడ్డి
- కంగుతిన్న స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం
- ఓటమిపై కాంగ్రెస్ శ్రేణులపై శ్రీహరి ఆగ్రహం
లింగాలఘనపురం, నవంబర్ 1 : జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కళ్లెం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరిగిన సంఘం ఎన్నికల్లో తొమ్మిది డైరెక్టర్ స్థానాలకు గాను అన్నింటినీ గెలుచుకొని బీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఫలితాలపై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కంగుతినడంతోపాటు కాంగ్రెస్ శ్రేణులపై మండిపడినట్టు తెలిసింది. వివరాలు ఇలా.. ఆదివారం కళ్లెం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు జరిగాయి.
మొదట 9 మంది డైరెక్టర్లను రైతులు ఎన్నుకుని ఆ తరువాత డైరెక్టర్ల ఓటింగ్‌తో చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి 9 మంది డైరెక్టర్లు నామినేషన్లు వేయగా, కాంగ్రెస్ ఏడుగురిని బరిలోకి నింపింది. సొసైటీలో 81 మంది పాల ఉత్పత్తిదారులు సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు సభ్యులను రహస్య ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. పాడి రైతులు మాత్రం తాము బీఆర్ఎస్ వెంటే ఉంటామని తేల్చిచెప్పారు.
స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సూచనతో బీఆర్ఎస్ మండల కన్వీనర్ చౌదరపల్లి శేఖర్, కళ్లెం సర్పంచ్ బండ శోభాచంద్రమౌళి, కార్యకర్తలు వ్యూహం రచించి తొమ్మిది మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులతోపాటు 45 మంది పాల ఉత్పత్తిదారులను నాలుగు రోజులక్రితం విహార యాత్రకు తరలించారు. ఆదివారం ఓటింగ్ జరుగగా బీఆర్ఎస్ బలపరిచిన 9 మంది డైరెక్టర్లు.. జిల్లెల పాపిరెడ్డి, నకిర్త కిష్టయ్య, నకిర్త మల్లయ్య, నకిర్త స్వప్న, కల్లూరి భాస్కర్, మబ్బు పరశురాములు, మబ్బు రాములు, పూర్ణ కవిత, బండబోయిన బాలరాజు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. ఆ తరువాత డైరెక్టర్లు జిల్లెల పాపిరెడ్డిని చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓటమిని తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
కడియం బుద్ధి తెచ్చుకోవాలి
ఈ ఫలితాలపై బీఆర్ఎస్ మండల కన్వీనర్ చౌదరపల్లి శేఖర్ మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నానని ప్రగల్భాలు పలికే కడియం శ్రీహరి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో జరిగిన ఎన్నికల్లో 9 మంది డైరెక్టర్లకు గాను ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేక పోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేయాలని ప్రయత్నించినా విజయం బీఆర్ఎస్ పార్టీనే వరించిందని చెప్పారు. ఎమ్మెల్యే కడియం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆయన సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

