Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
మక్తల్ పురపాలిక పరిధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ‘లవ్ మక్తల్’ బోర్డు అపరిశుభ్రంగా మారడంపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
నారాయణపేట జిల్లా మక్తల్ పురపాలిక పరిధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ‘లవ్ మక్తల్’ బోర్డు అపరిశుభ్రంగా మారడంపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డుపై ఇష్టానుసారంగా వివిధ రకాల పోస్టర్లు అతికించడంతో పాటు, బోర్డు వద్ద మద్యం సీసాలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని వారు పేర్కొన్నారు. పురపాలక అధికారులు, చైర్పర్సన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు
ఆదివారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వయంగా రంగంలోకి దిగారు. నీటితో బోర్డుతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలో పురపాలికకు సంబంధించిన పలు ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని, అధికారులు వాటిపై దృష్టి సారించడం లేదని అన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ‘లవ్ మక్తల్’ బోర్డును నిరంతరం పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పురపాలిక పరిధిలో మరమ్మతులు అవసరమైన ప్రాంతాలను గుర్తించి వెంటనే పనులు చేపట్టాలని కోరారు. ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

