మతిభ్రమించి అద్దంకి ప్రేలాపనలు
‘గతం మరిచావా అంద్దంకి.. గతంలో టికెట్ కోసం బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు వద్దకొచ్చి దేబిరించిన విషయం మిరిచా వా?’ అని కాంగ్రెస్ ఎ మ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై బీఆర్ఎస్ నేత గౌ తంప్రసాద్ మండిపడ్డారు. హరీశ్‌రావును విమర్శించే అర్హత నీకెక్కడిదని, మతిభ్రమించే పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నావని ధ్వజమెత్తారు.
- గతంలో టికెట్ కోసం హరీశ్‌ను దేబిరించింది గుర్తుకు లేదా?
- ఆయన్ను విమర్శించే అర్హతెక్కడిది?
- బీఆర్ఎస్ నేత గౌతం ప్రసాద్ ఫైర్
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తేతెలంగాణ) : ‘గతం మరిచావా అంద్దంకి.. గతంలో టికెట్ కోసం బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు వద్దకొచ్చి దేబిరించిన విషయం మిరిచా వా?’ అని కాంగ్రెస్ ఎ మ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై బీఆర్ఎస్ నేత గౌ తంప్రసాద్ మండిపడ్డారు. హరీశ్‌రావును విమర్శించే అర్హత నీకెక్కడిదని, మతిభ్రమించే పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నావని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పని అయిపోయిందని హరీశ్‌రా వు వద్ద అద్దంకి దయాకర్ చెప్పుకొన్నది.. ఆయన వద్ద ఆర్థికసాయం పొందింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మద్యంమత్తులో సోయిలేకుండా మాట్లాడటం అద్దంకికి అలవాటేనని దెప్పిపొడిచారు. సిద్దిపేటలో హరీశ్‌రావు పని అయిపోయిందని చెప్తున్న దయాకర్.. దమ్ముంటే సిద్దిపేటలో పోటీకి సీఎంను ఒప్పించాలని సవా ల్ విసిరారు.
హరీశ్‌రావుపై జోస్యం చెప్పే బదులు.. జూబ్లీ, ఇమ్లీబన్ బస్టాండ్ల దగ్గర చిలుక జోస్యం చె ప్పుకొంటే ఉపాధి దొరుకుతుందని చురకలంటించారు. తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా త్యజించిన చరిత్ర హరీశ్‌రావుదని స్పష్టంచేశారు. సిద్దిపేటలో ఓటమెరుగని నాయకుడని గుర్తుచేశా రు. కానీ తుంగతుర్తిలో రెండుసార్లు గాదరి కిషోర్ చేతిలో చావుదెబ్బ తిన్న అద్దంకి దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని ఎగిరెగిరి పడటం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. చిల్లర నాయకుడిగా ముద్రపడ్డ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బుద్ధిలేకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదని పేర్కొన్నారు. ఆయన కారుకు యాక్సిడెంట్ అయితే కేటీఆర్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. మరోసారి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే త గిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

