కేసీఆర్ పాలనలో రైతులది రాజభోగం
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు రాజులా బతికితే.. గత మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో అన్నదాత అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
- కాంగ్రెస్ హయాంలో కష్టాలయోగం
- 11న నిర్మల్‌లో రైతు గర్జనకు కేటీఆర్
- మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నిర్మల్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు రాజులా బతికితే.. గత మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో అన్నదాత అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 11న నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు గర్జన మహాసభకు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు.
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల విద్యుత్తు, ఎరువులు, సాగునీరు అందుబాటులో ఉండేవని, ప్రస్తుత కాంగ్రెస్ హయాం లో యూరియా కోసం రైతులు చెప్పులు, పాస్‌బుక్కులు క్యూలో పెట్టుకొని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. ప్రపంచమంతా కరువు వచ్చినా తెలంగాణలో మాత్రం రావొద్దన్న దూరదృష్టితో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, అలాంటి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
రైతుల సమస్యలను ఎత్తిచూపడంతోపాటు వారిపక్షాన పోరాడేందుకే నిర్మల్‌లో రైతుగర్జన మహాసభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బాల్క సుమన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జులు రామ్‌కిషన్‌రెడ్డి, భూక్యా జాన్సన్‌నాయక్, ముథోల్ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలు పడకంటి రమాదేవి, లోలం శ్యాంసుందర్, కిరణ్ కొమ్రేవార్, విలాస్ గాదేవార్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- KCR
- KTR
- RythuGarjana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

